ఇండస్టీలో జరుగుతున్న తాజా పరిణమాలపై అప్పటి హీరోయిన్ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో స్పందించారు.టాలీవుడ్‌లో జరుగుతున్న సమస్యలపై మొదటిసారిగా రోజా స్పందించారు.టాలీవుడ్‌లో అమ్మాయిలపై జరుతున్న అన్యాయంపై రోజా మాట్లాడుతు ..ఇండస్ట్రీలో ఇది కొత్తగా వచ్చింది కాదు.ఎప్పటి నుండో జరుగుతుందని దీనిపై ఎవరు ఏం చేయలేరని ..ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే హీరోయిన్లు చాలా జాగ్రత్తగా ఉండలని మోసాపోవద్దని సలహా ఇచ్చారు.
మేం సినిమాలు చేసేటప్పుడు ఇప్పుడు ఉన్న సౌకర్యాలు ఉండేవి కావని తెలిపింది.ఇక సినిమాల విషయానికి వస్తే తాను మెగస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని, చదువుకునే రోజులలో నాగర్జున గారిని బాగా ఇష్టపడేదానని చెప్పుకొచ్చారు.ఇక రాజకీయలపై మాట్లాడుతు తాను ఏ పార్టీలో ఉన్నా నిజాయితిగా పని చేసానని..తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నన్ను మోసం చేసారని ,నా ఓటమికి టిడిపి వాళ్లే సహకరించారని ఆ భాదను తట్టుకోలేక టిడిపి విడానని తెలిపారు ఎమ్మెల్యే రోజా.తాను బ్రతికి ఉన్నంత కాలం జగన్‌కు అండగా ఉంటానని చెప్పారు.
వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిలను ఉద్దేశించి సోషల్ మీడియాలో చాలా దారుణంగా రాశారని… ఆవిడ ఎత్తు ఎదిగిన పిల్లలు ఆమెకు ఉన్నారని… ఆమె కుటుంబం బాధపడేలా టీడీపీవారు దారుణమైన ప్రచారం చేశారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.పవన్ కల్యాణ్ టాప్ హీరోల్లో ఒకరని… అయితే రాజకీయాల్లో నెగ్గి ఆయన అధికారంలోకి వస్తారని తాను భావించడం లేదని… కానీ, రాజకీయాలను మాత్రం ప్రభావితం చేయగలరని తెలిపారు.రాబోయే రోజులలో జగన్ సీఎం కావడం ఖాయంగా చెప్పారు రోజా.