మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) చిత్రం 2026 జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, మెగాస్టార్ చిరంజీవి మరియు నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను 2026 జనవరి 7న నిర్వహించేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం జరగనుందని మేకర్స్ ప్రకటించారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు చిత్రబృందం మొత్తం హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతకాలంగా ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, సినిమాపై మంచి బజ్ నెలకొంది.
ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సునీల్, వీటీవీ గణేష్, రేవంత్, హర్ష వర్ధన్, సచిన్ ఖేడేకర్, అభినవ్ గోమటం తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించగా, సంగీతాన్ని భీమ్స్ సెసిరోలియో అందిస్తున్నారు.
