Thursday, April 25, 2024
- Advertisement -

సిద్దమవుతున్న “ముఖచిత్రం”

- Advertisement -

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ముఖచిత్రం”. కలర్ ఫొటో మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. కాల భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల ముఖచిత్రం సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాతో గంగాధర్ అనే కొత్త దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు.

ఫన్ అండ్ ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గురువారం ముఖచిత్రం సినిమాలోని క్లాస్ రూమ్ సాంగ్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. విద్యార్థి జీవితపు ప్రేమకథను అందంగా రచించారు రామజోగయ్యశాస్త్రి. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చడంతో పాటు సింధూరి విశాల్ తో కలిసి పాడారు.

దర్శకుడు సందీప్ రాజ్ “కలర్ ఫొటో” సినిమాలో తరగది గది దాటి పాట సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆయన కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్న ముఖచిత్రం సినిమాలోనూ క్లాస్ రూమ్ లో పాట ఆ ఫీల్ తోనే సాగుతూ ఆకట్టుకుంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -