Thursday, May 9, 2024
- Advertisement -

అందాలు ఆరబోస్తున్న కన్నడ బ్యూటీ

- Advertisement -

గత కొంతకాలంగా కన్నడ బ్యూటీలు టాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ‘నన్ను దోచుకుందువటే’ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ తరువాత ఒకటి రెండు చిన్న సినిమాలో కనిపించిన ఈ నటి ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కనున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు సభ నటేష్ సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను దృష్టిని ఆకర్షిస్తోంది.

మొన్న మొన్నటి దాకా పక్కింటమ్మాయి తరహా పాత్రలో కనిపించిన ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ట్రెడిషనల్ అవతారంలో కనిపిస్తుంది. ఈ మధ్యనే లెహంగా వేసుకొని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరోవైపు అభిమానులు ఇంత అందమా అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. ఇక ఈమె నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా తర్వాత అయినా నరేష్ కు పెద్ద హీరోలతో నటించే అవకాశం వస్తుందో లేదో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -