Tuesday, May 14, 2024
- Advertisement -

నాగ‌చైత‌న్య కెరీర్‌లో బిగెస్ట్ హిట్‌గా ‘మ‌జిలీ’

- Advertisement -

నాగ‌చైత‌న్య‌తో హిట్ చాలాకాలం దొబుచులాడింది. రారండోయ్ వేడ‌క చూద్దాం సినిమా త‌రువాత నాగ‌చైత‌న్య న‌టించిన సినిమాలు అన్ని ఫ్లాప్‌లుగా నిలిచాయి. హిట్ కోసం నాగ‌చైత‌న్య చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు. ఎట్ట‌కేల‌కు మ‌జిలీ సినిమాతో హిట్ కొట్టాడు నాగ‌చైత‌న్య‌. నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌జిలీ సినిమా గ‌త వారం విడుద‌ల అయింది. పెళ్లి త‌రువాత స‌మంత , నాగచైత‌న్య‌లు క‌లిసి న‌టించిన సినిమా కావ‌డంతో మ‌జిలీపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి.

అంద‌రి అంచ‌నాల‌ను నిజం చేస్తు సినిమా సూప‌ర్ హిట్‌గా నిలిచింది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమా తొలిరోజునే భారీ వసూళ్లను రాబట్టింది. తొలిరోజు వసూళ్లు చూసి, 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమని చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. నాగ‌చైత‌న్య కెరీర్‌లో బిగెస్ట్ హిట్‌గా నిలిచింది మ‌జిలీ.ఈ సినిమాతో మ‌రోసారి రొమాంటిక్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు నాగ‌చైత‌న్య‌. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య క్రికెట‌ర్‌గా క‌నిపించిన సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -