Friday, March 29, 2024
- Advertisement -

కొత్త హీరోయిన్‌ను ప‌ట్టుకొస్తున్న నాగ‌చైత‌న్య‌

- Advertisement -

తాము న‌టించిన సినిమాల‌తో హీరోయిన్స్‌ను కొత్త‌గా ప‌రిచ‌యం చేస్తుంటారు. అలా ప‌రిచ‌యం చేసిన వాళ్లు ఆ కొన్నాళ్ల‌కు స్టార్ న‌టులుగా మారుతారు. ఈ విష‌యంలో అక్కినేని ఫ్యామిలీ బాగా క‌లిసొస్తుంది. ఎందుకంటే ఏఎన్నార్ కూడా ఎంతోమంది కొత్త హీరోయిన్స్‌ను తీసుకొచ్చి సినీ ప‌రిశ్ర‌మ‌లో నిల‌బ‌డేలా చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు అక్కినేని నాగార్జున కూడా అంతే. నాగ్ అనుష్క‌ను తీసుకొచ్చాడు. ఇప్పుడు అనుష్క స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆ వార‌స‌త్వాన్ని అక్కినేని నాగ‌చైత‌న్య కొన‌సాగిస్తున్నాడు. చైతూ స‌మంత‌ను తీసుకొచ్చాడు. ఆ త‌ర్వాత స‌మంత స్టార్ హీరోయిన్‌గా అయ్యింది. దాంతోపాటు అక్కినేని ఇంటికి కోడ‌లిగా మారింది.

ఇలా అక్కినేని ఫ్యామిలీ హీరోయిన్స్‌కు ద్వారం లాంటిది. ఈ క్ర‌మంలో నాగచైతన్య ఇప్పుడు ఒక కొత్త హీరోయిన్‌ను ప‌రిచ‌యం చేస్తున్నాడు. చైతూ ఒక కొత్త హీరోయిన్‌ను త‌న సినిమాతో తీసుకొస్తున్నాడు. ‘నిన్నుకోరి’ దర్శకుడు శివ నిర్వాణతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ త‌న భార్య స‌మంత‌తో న‌టిస్తూనే మ‌రో హీరోయిన్‌కు అవ‌కాశం ఉంది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీ క‌థ కావ‌డంతో మరో హీరోయిన్‌కు కూడా అవ‌కాశం ఉంది. అయితే ఆ పాత్ర‌లో ఇప్పుడున్న హీరోయిన్స్ కాకుండా ఒక కొత్త అమ్మాయిని దర్శకుడు ఎంపిక చేశార‌ని స‌మాచారం. నాగ చైతన్య, సమంత జంటగా పెళ్లి త‌ర్వాత తొలిసారి నటిస్తున్నారు. ఈ సినిమాను సైని స్క్రీన్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమా నిర్మాణ‌మ‌వుతోంది. మే నుంచి సెట్స్‌పైకి వెళ్ల‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -