అక్కినేని నాగచైతన్య ఒకేసారి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.తనకు ప్రేమమ్ లాంటి హిట్ ఇచ్చిన చందూ మొండేటి వంటి దర్శకుడితో సవ్యసాచి , మారుతి దర్శకత్వంలో శైలజారెడ్డి అల్లుడు సినిమాలు చేస్తున్నాడు చైతు.ఈ రెండు సినిమాలు దాదాపు పూర్తి కావచ్చినవే కావడంతో ఏ సినిమా మొదటి విడుదల చేయాలో అనే ఆలోచనలో ఉన్నాడు నాగ చైతన్య. సవ్యసాచి సినిమాకు గ్రాఫికల్ వర్క్ ఎక్కువుగా ఉండటంతో ఈ సినిమా ఆలస్యం అయ్యే అకాశాలు ఉన్నాయి.
దీంతో శైలజారెడ్డి అల్లుడు సినిమాను మొదట విడుదల చేయాలని చైతు ఫిక్స్ అయ్యాడు.దీనిలో భాగంగానే శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.ఈ పోస్టర్‌లో చైతుతో పాటు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్, అత్త క్యారెక్టర్ చేస్తున్న నటి రమ్యకృష్ణ కూడా ఉంది.నాగచైతన్య ,అను ఇమ్మాన్యుయేల్ వైపు ఓ చూపు చూస్తున్న రమ్యకృష్ణ ఫోటో ఆకట్టుకునే విధాంగా ఉంది.సినిమాను ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.