Friday, May 24, 2024
- Advertisement -

చైతు పుట్టిన రోజున స‌మంత ఏం చేసిందో తెలుసా?

- Advertisement -

టాలీవుడ్ స్వీట్ క‌పూల్ నాగచైత‌న్య‌.స‌మంతలు వీలు చిక్కితే చాలు హాలీడే ట్రిప్పుల‌కు చెక్కేస్తున్నారు.వీరి పెళ్లి అయిన ద‌గ్గ‌ర నుంచి మీడియా సైతం వీరి మీద ఫోక‌స్ ఎక్కువుగా పెట్టింది.ఈ యువ జంట కూడా విహార యాత్రలకు వెళ్లిన ఫోటోలు, కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను అభిమానుల కోసం సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.తాజాగా సమంతా షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం నాడు చైతన్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఈ వేడుకలు గోవాలో జరుపుకుంది ఈ జంట. ఈ సందర్భంగా సమంత తన భర్తకి విషెస్ చెబుతూ కొన్ని ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.ఇక పెళ్లి త‌రువాత వీరిద్ద‌రు క‌లిసి మ‌జిలి(వ‌ర్కింగ్ టైటిల్‌) సినిమాలో న‌టిస్తున్నారు.నాగ‌చైత‌న్య పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ సినిమాలో నాగ‌చైతన్య లుక్‌ని విడుద‌ల చేశారు.ఈ సినిమాకు నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -