- Advertisement -
ఎట్టకేలకు అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. ఇవాళ ఉదయం 9:42 గంటలకు చైతూ- శోభిత ఎంగేజ్‌మెంట్ జరిగిందని తెలిపారు నాగార్జున. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ 8.8.8 వీరి అనంతమైన ప్రేమకు నాందికి గుర్తింపు అని తెలిపారు.
ఈ విషయాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నామిన చెప్పారు. వీరికి దేవుడి ఆశీస్సులు ఉన్నాయని వెల్లడించారు. 2021లో సమంత నుంచి విడాకులు తీసుకున్నారు చైతూ. అనంతరం శోభితతో ప్రేమలో పడ్డారు. ఇక వీరిద్దరి డేటింగ్‌పై పుకార్లు షికార్ చేసిన ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఎంగేజ్‌మెంట్ జరిగిందని తెలిపారు నాగ్. దీంతో అక్కినేని కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది.