- Advertisement -

నాగబంధం..ఎప్పుడో తెలుసా?

- Advertisement -

దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న చిత్రం‘నాగబంధం’. ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, మూవీ లవర్స్ ఈ చిత్రం విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు ఆ ఎదురుచూపులకు తెరదించుతూ చిత్రబృందం అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామా జూలై 3, 2026న పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించింది.

ఈ చిత్రంలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే జగపతి బాబు, మురళి శర్మ,జయప్రకాశ్, బీఎస్ అవినాష్ ముఖ్యమైన సహాయ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తుండగా ప్రస్తుతం సినిమా నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.

జునేద్ కుమార్, అభి సంగీతాన్ని అందిస్తుండగా మొత్తంగా, ‘నాగబంధం’ టీజర్‌తోనే మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -