Wednesday, May 8, 2024
- Advertisement -

మ‌జిలి టీజ‌ర్ …లిప్ కిస్‌తో రెచ్చిపోయిన నాగ‌చైత‌న్య‌

- Advertisement -

టాలీవుడ్‌లో క్యూట్ పెయిర్ అంటే అంద‌రికి ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది చైతు ,స‌మంత‌నే. వీరిద్ద‌రి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. పెళ్లి త‌రువాత కూడా స‌మంత సినిమాల‌ను కొన‌సాగిస్తోంది. పెళ్లి త‌రువాత భ‌ర్త నాగ‌చైత‌న్యతో క‌లిసి స‌మంత న‌టిస్తోన్న చిత్రం మ‌జిలి. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.

నీకో సంవత్సరం టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్ సచినే అవుతావో సోంబేరే అవుతావో నీ ఇష్టం అంటూ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదల‌వుతోంది. సినిమాలో చైత‌న్య క్రికెట‌ర్‌గా క‌నిపించ‌బోల‌తున్నాడు. టీజ‌ర్‌ను చూస్తుంటే చైతు యువ‌కుడిగా ఉన్న స‌మ‌యంలో ఓ అమ్మాయిని ఇష్ట‌ప‌డ‌తాడ‌ని తెలుస్తోంది. కానీ కొన్ని కారణాల వలన ఇద్దరూ విడిపోతారు. ఆ తరువాత ఇష్టం లేక‌పోయిన సమంతతో పెళ్లి జరుగుతుంది. ఇష్టం లేని స‌మంత‌తో కాపురం చేయ‌డు నాగ‌చైత‌న్య‌. నువ్వు నా రూమ్ లోకి రాగలవేమో కానీ నా మనసులోకి ఎప్పటికీ రాలేవు అంటూ చైతన్య , సమంతతో చెప్పే డైలాగ్ టజ‌ర్‌కే హైలెట్‌గా నిలిచింది.

టీజ‌ర్‌లో ఘాటైన లిప్ కిస్‌తో రెచ్చిపోయాడు నాగ‌చైత‌న్య‌. అయితే అది స‌మంతతో కాదు , సినిమాలో వేరే క్యారెక్ట‌ర్‌లో న‌టించిన అమ్మాయితో చైతు లిప్ కిస్ పెట్టాడు.మొత్త‌నికి ఈ సినిమాలో కూడా రెండు ప్రేమ క‌థ‌ల‌ను ఎంచుకున్నాడు ద‌ర్శ‌కుడు. త‌న మొద‌టి సినిమాలో కూడా ఇలాంటి క‌థ‌నే తీసుకుని విజ‌యం సాధించాడు శివ నిర్వాణ‌. టీజ‌ర్‌లో వ‌చ్చిన నేపధ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక సినిమాను ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రి ఈ సినిమాతో అయిన చైత‌న్య హిట్ కొడ‌తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -