Friday, April 19, 2024
- Advertisement -

నాని కోసం త్యాగం చేసిన నాగార్జున??

- Advertisement -

అక్కినేని నాగార్జున న్యాచురల్ స్టార్ నాని ఇద్దరు కలిసి నటించిన సినిమా దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ని అశ్విని దత్ నిర్మించారు. ఆ సినిమా చేసినప్పటి నుండి నాని కి నాగార్జున కి మంచి రాపో ఏర్పడింది. అందుకే కాబోలు ఇప్పుడు నాని తన చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వస్తాను అంటే నాగార్జున లైన్ క్లియర్ చేశాడు.

వివరాలలోకి వెళితే మన్మధుడు 2 సినిమా ని నాగార్జున తన పుట్టిన రోజు కానుకగా ఆగస్ట్ నెల లో విడుదల చేద్దాము అని ప్లాన్ చేసినట్టు మీడియా లో వార్తలు వచ్చాయి. అయితే ఇది ఎంత వరకు నిజమో కానీ నాగార్జున కి మన్మధుడు 2 దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కి దగ్గరి వ్యక్తులు చాలా మంది ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

అయితే నిన్న వచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం నాని తన చిత్రం గ్యాంగ్ లీడర్ ను ఆగస్ట్ 30 వ తారీఖు విడుదల చేస్తుండటం తో నాగార్జున మన్మధుడు 2 వచ్చే అవకాశాలు లేవు అని దాదాపుగా కరారు అయిపోయింది. చూడబోతే నాని కోసం నాగార్జున త్యాగం చేసినట్లు అనిపిస్తున్నా సోలో రిలీజ్ కోసం ప్రయత్నిస్తున్న నాగార్జున ఒక నెల ఆగి అయినా కానీ సోలో రిలీజ్ దొరికినప్పుడే సినిమా రిలీజ్ చేద్దాం అనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -