Friday, May 3, 2024
- Advertisement -

అక్కినేని ఫ్యామిలీలోకి సమంత రాగానే నాగ్ కి ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?

- Advertisement -

ఇటివలే అక్కినేని నాగ చైతన్య, సమంతలు.. గోవాలో వైభవంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లికి ముందు సమంత ‘రాజు గారి గది 2’ సినిమాలో నటించింది. ఆ మూవీలో నాగార్జున ప్రధాన పాత్రను పోషించాడు. ఓంకార్‌ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా విడుదలైన ‘రాజు గారి గది 2’ చిత్రం పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంది. పెళ్లి తర్వాత రిలీజ్ అయిన సినిమా కావడంతో సమంత ఫ్యాన్స్ తోపాటు అంత కూడా ఈ సినిమా చూసేందుకు క్యూలు కడుతున్నారు.

దాంతో భారీగా లాభాలు వస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టింది. ఇక ఈ మూవీలో నటించినందుకు గాను నాగార్జున పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటను కోరాడు. సినిమా విడుదలైన తర్వాత మంచి కలెక్షన్స్‌ వస్తున్న నేపథ్యంలో నాగార్జునకు ఈ సినిమా ద్వారా కనీసం 15 కోట్లు అయినా వచ్చే అవకాశం ఉందంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తుంది. ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించిన సమంతకు కూడా దాదాపు కోటి రూపాయల వరకు ముట్టజెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే మామయ్య నాగార్జున కోసం సమంత ఈ చిత్రంలో ఫ్రీగా నటించిందని, పారితోషికం లేకుండానే ఆమె చేసిందని, కేవలం 25 రోజుల డేట్లు ఇచ్చి సినిమాను పూర్తి చేసిందంటున్నారు.

మొత్తానికి సమంత ఎంట్రీ ఇవ్వడంతోనే నాగార్జునకు ఏకంగా 15 కోట్లు కలిసి వచ్చింది. పెళ్లి అయిన వారం రోజుల్లోనే విడుదల అవ్వడంతో పబ్లిసిటీ బాగా వచ్చింది. దాంతో సినిమా రేంజ్‌ పెరిగి పోయింది. మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమా 40 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. మొత్తానికి సమంత ద్వారా అక్కినేని ఫ్యామిలీకి బాగా కలిసివచ్చిందని నాగ్ అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -