అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్. అఖిల్ హీరోగా లాంచింగ్ జరిగినట్లు మరెవ్వరికి జరగలేదంటే అతిశేయోక్తి కాదు. అప్పటి స్టార్ డైరెక్టర్ వివి.వినాయక్‌తో అఖిల్ మొదటి సినిమా ప్లాన్ చేశాడు నాగర్జున. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాని అందరి అంచనాలను తలకిందులు చేసింది అఖిల్ మొదటి సినిమా. బాక్సాఫీస్ వద్ద అఖిల్ సినిమా ఘోరంగా ఫెయిల్ అయింది. అఖిల్ దెబ్బకు వినాయక్‌కు సినిమాలు లేకుండా పోయాయి.
అఖిల్‌ను హీరోగా నిలబెట్టడానికి అక్కినేని కుటుంబానికి మనం వంటి మరిచిపోలేని హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్‌ను రంగంలోకి దించాడు నాగర్జున. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమాను ప్లాన్ చేశాడు నాగ్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హలో సినిమా కూడా డిజాస్టార్‌గా నిలిచింది. ఈ సినిమా కూడా అఖిల్‌కు హిట్ ఇవ్వలేకపోయింది. ఒకనొక దశలో అఖిల్ హీరోగా పనికి వస్తాడా అనే అనుమానం సగటు ప్రేక్షకుడిలో కలిగింది. దీంతో కాస్తా గ్యాప్ తీసుకుని తన మూడో సినిమాను ప్లాన్ చేశాడు అఖిల్. ఈ సారి తొలిప్రేమ హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరిని తన దర్శకుడిగా పెట్టుకున్నాడు.
తన ఫ్యామిలీకి కలిసి వచ్చిన మజ్నుకు ముందు మిస్టర్ అనే యాడ్ చేసి మిస్టర్ మజ్నుగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో మ్యాటర్ లేదని ప్రేక్షకులు తెల్చేశారు. సినిమా ఏమాత్రం బాలేదని కామెంట్స్ వచ్చాయి. ఎంతలా అంటే అఖిల్‌ను సినిమాలు మానేసి ఇంట్లో కూర్చోవడం బెటర్ అనేంత కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా కలెక్షన్లు కూడా ఏ మాత్రం బాలేదని ట్రెండ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా వల్ల నిర్మాతకు బాగా నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. అఖిల్ కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు నాగ్ చేయని ప్రయత్నం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసిన అఖిల్‌కు హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇక అఖిల్ విషయంలో నాగ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అఖిల్‌ను నాగ్ సినిమాలు మానేయామని కోరినట్లు తెలుస్తోంది. కొంతకాలం గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తే బాగుటుందనే అనే ఆలోచన చేస్తున్నాడట నాగ్. అఖిల్ విషయంలో నాగ్ ఆలోచన బాగానే ఉంది కాని, స్టార్ హీరో వారసుడు ఎంట్రీ ఇచ్చిన తరువాత ఇలా మధ్యలోనే సినిమాలకు బ్రేక్ ఇస్తే ప్రేక్షకులలోకి ఇది నెగిటివ్‌గా వెళ్తుందని అంటున్నారు అక్కినేని అభిమానులు. మరి అఖిల్ విషయంలో నాగ్ ఏం చేస్తాడో చూడాలి.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!