- Advertisement -
బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా NBK109 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తోంది. ఇవాళ బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. జాలి, దయ, కరుణ లాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు అద్భుతంగా ఉంది.
అభిమానులు, మాస్ ప్రేక్షుకులు బాలకృష్ణను ఎలాగైతే చూడాలి అనుకుంటారో అలాంటి గ్లింప్స్ అందించారు బాబీ. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.