Wednesday, May 22, 2024
- Advertisement -

బాలకృష్ణ-రవికుమార్ సినిమా కి కొత్త టైటిల్ ఏంటో తెలుసా…?

- Advertisement -

తమిళం లో స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేసే దర్శకుల్లో కె ఎస్ రవికుమార్ కూడా ఒకరు. ఆయన తమిళం లో రజినీకాంత్, కమల్ హాసన్ వంటి పెద్ద స్టార్ల తో పని చేశారు. తెలుగు లో కూడా తన పనితనం చూపిన ఈ దర్శకుడు చివరగా బాలకృష్ణ తో జై సింహ అనే చిత్రానికి పని చేసాడు. ఈ సినిమా కి సీ కళ్యాణ్ నిర్మాత గా వ్యవహరించారు. కళ్యాణ్ ఈ సినిమా కోసం బాగా కష్టపడి సినిమా ని విజయ పథం లోకి తీసుకొని వెళ్లారు. అయితే ఆ సినిమా చేస్తున్నప్పుడే మళ్ళి ఈ హీరో దర్శకుడు కాంబినేషన్ ని పెద్ద స్క్రీన్ మీద తీసుకురావాలని కళ్యాణ్ భావించారు. దానికి దర్శకుడు హీరో ఒప్పుకున్నా కానీ అది పట్టాలెక్కడానికి చాలా సమయమే పట్టింది.

బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భం గా ఈ సినిమా త్వరలో మొదలు కానుంది అనే విషయాన్ని దర్శక నిర్మాతలు మరొకసారి ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి రూలర్ అనే టైటిల్ ని పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ మాకు తెల్సిన వివరాల ప్రకారం ఈ సినిమా కి ప్రస్తుతం దర్శక నిర్మాతలు క్రాంతి అనే టైటిల్ ని పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం పై పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -