Monday, May 6, 2024
- Advertisement -

గ్లామర్ ఉంది కానీ పట్టించుకోవడం లేదు..!

- Advertisement -

నందిత శ్వేతా అంటే చాల మంది గుర్తు పట్టకపోవచ్చు. కానీ ఎక్కడికి పోతావు చిన్నవాడా లో సెకండ్ హాఫ్ లో దెయ్యం పాత్ర చేసిన నటి అంటే వెంటనే అందరూ గుర్తు తెచ్చుకుంటారు. దురదృష్టవశాత్తు ఈ హీరోయిన్ నటి గా మంచి పేరు తెచ్చుకున్న కానీ ఎందుకో తన పేరు మాత్రం అంతగా సంపాదించుకోలేకపోయింది. ఈ విషయం బాధాకరమైన నందిత కి మాత్రం పోయేది ఏమి లేదు. ఇటు తెలుగు అటు తమిళం లో బిజీ గా ఉంటున్న హీరోయిన్ల లో నందిత కూడా ఒకరు కానీ ఎప్పుడూ అవకాశాల కోసం వెతుకులాట చేయలేదు. తమిళం లో డీ గ్లామర్ పాత్రల తో పాటు అన్ని విధాలా పత్రాలు వస్తున్న తెలుగు లో ఇచ్చే పారితోషికం కోసం చాల మంది ఇటు వైపు చూస్తూ ఉంటారు.

నందిత కూడా తెలుగు లో సినిమాలు చేయాలనీ, గ్లామరస్ గా కనిపించే పాత్రలు సెలెక్ట్ చేసుకోవాలనే ఉదేశ్యమ్ తో ఉంది కానీ పాపం విజయాలు ఎక్కువ లేకపోవడం తో ఆవిడ ని పట్టించుకొనే వాళ్ళే కరువు అయ్యారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా తో అరంగేట్రం చేసాక, శ్రీనివాస కళ్యాణం, ప్రేమ కథా చిత్రం 2, ఇంకా మరి కొన్ని సినిమాలు చేసినా నందిత ని మాత్రం విజయం వరించలేదు.

త్వరలో అక్షర అనే ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా లో నటిస్తున్న ఈ భామ ఆ సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ సినిమా విజయం సాధించాక ఆమె ఫేట్ ఏమైనా మారుతనదేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -