Thursday, April 25, 2024
- Advertisement -

నందు కి అంత సీన్ ఉందా?

- Advertisement -

‘100% లవ్’, ‘జయ జానకి నాయక’ సినిమాలలో మంచి పాత్రలలో నటించిన నందు హీరోగా మాత్రం వరుస డిజాస్టర్లు అందుకున్నాడు. తాజాగా నందు హీరోగా బంధం రేగడ్ అనే ఇండిపెండెంట్ సినిమాతో పాప్యులర్ అయిన సాహిత్ మోత్కూరి దర్శకత్వం లో ‘సవారీ’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదలై ప్రేక్షకులను నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. సినిమా కథ ప్రకారం రాజు (నందు) ఒక చదువులేని గుర్రపు స్వారీ చేసే కుర్రాడు. అతను భాగి (ప్రియాంక శర్మ) అనే బాగా చదువుకున్న అమ్మాయి తో ప్రేమలో పడతాడు.

అదే సమయంలో భాగి రాజు ని తన బాయ్ గా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ శాండీ కి పరిచయం చేస్తుంది. ఈ ముగ్గురి మధ్య లో కాళీ అండ్ గ్యాంగ్ ఎంటర్ అవుతుంది. తర్వాత ఏమైంది? రాజు ప్రేమని భాగి అంగీకరిస్తుందా? కాళీ అండ్ గ్యాంగ్ కి ఏం కావాలి? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో నందు ఒక పక్కా తెలంగాణ అబ్బాయిలాగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ కనిపిస్తాడు. డైలాగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉండటంతో ప్రస్తుతం ఈ టీజర్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరుస్తుంది. మరి ఈ సినిమాతో అయినా నందు అదృష్టం మారుతుందో లేదో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -