Saturday, May 10, 2025
- Advertisement -

ఫలక్నుమా దాస్ పై నాని ప్రేమ!

- Advertisement -

ఫలక్నుమా దాస్.. ప్రస్తుతం సినిమా పరిశ్రమ మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అర్జున్ రెడ్డి, బాహుబలి చిత్రాల తర్వాత కేవలం ఈ ఫలక్నుమా దాస్ సినిమా కి మాత్రమే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తూ ఉండటం తో ఈ సినిమా పైన ఎనలేని ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. మలయాళం లో హిట్ అయినా అంగమలీ డైరీస్ కి తెలుగు లో రీమేక్ గా ఫలక్నుమా దాస్ వస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే నాని ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రావడం అందరినీ ఎంతగానో ఆశ్చర్య పరిచింది.

అయితే నాని ఫలక్నుమా దాస్ హీరో విశ్వక్సేన్ తో ఒక సినిమా చేయనున్నాడట. ఫలక్నుమా దాస్ సినిమా నచ్చి, విశ్వక్సేన్ తనని తాను ప్రమోట్ చేసుకున్న వైనం బాగా అనిపించి విశ్వక్సేన్ ని హీరో గా పెట్టి ఒక సినిమా నిర్మించాలి అనే ఉదేశ్యం వ్యక్తపరిచాడట. అయితే ఈ సినిమా కి సంబందించిన అధికారిక ప్రకటన ఫలక్నుమా దాస్ సినిమా విడుదల అనంతరం ఉండబోతుంది. ఈ సినిమా కి విశ్వక్సేన్ దర్శకత్వం వహిస్తాడా లేదా వేరే ఎవరైనా నా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -