సాధారణంగానే మన స్టార్ హీరోలు ఎక్కువ పారితోషకం తీసుకుంటారనే అందరికి తెలిసిందే. ఈ మధ్య మన హీరోలు నిర్మాతలతో డీల్ చేసుకుని వచ్చే లాభాలలో వాటా తీసుకుంటున్నారు. తెలుగు హీరోలలో ఎక్కువ పారితోషకం తీసుకునే హీరో మహేశ్ బాబు. ఈ టాలీవుడ్ సూపర్‌స్టార్ సినిమాకు 20 కోట్లు తీసుకుంటాడని సమాచారం. ఇటీవలే మహేశ బాబు నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. తాను తీసే సినిమాలలో వచ్చే లాభాలలో వాటా కూడా తీసుకుంటున్నాడు మహేశ్. ఇక నాని విషయానికి వస్తే నాని సినిమాకు ఐదు నుంచి ఆరు కోట్లు తీసుకుంటాడని తెలుస్తోంది.
మరి మహేశ్ కన్నా నాని రెమ్యూనరేషన్ తక్కవే కదా అనుకుంటే పొరపాటే. మహేశ్ బాబు సంవత్సరానికి ఒక్క సినిమాను మాత్రమే విడుదల చేస్తాడు. కాని నాని అలా కాదు. నాని సంవత్సరంలో మూడు నుంచి నాలుగు సినిమాలలో ఈజీగా నటిస్తాడు. నాని నాలుగు సినిమాలలో నటిస్తే మహేశ్ కన్నా పారితోషకం తీసుకున్నట్లే.ఈ రకంగా చూసుకుంటే నాని మహేశ్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నట్లే కదా. నాని ప్రస్తుతం జెర్సీ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు విక్రమ్ కుమర్‌తో మరో సినిమా, ఇంద్రగంటి మోహన్ కృష్ణతో ఇంకో సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు.
- Advertisement -
మహేశ్ కన్నా ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న నాని
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -