న్యాచులర్ స్టార్ నానికి మెగా ఫ్యాన్స్‌కు మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తోంది. గత కొంతకాలంగా నానిని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో అతన్ని ట్రోల్ చేస్తున్నారు. అదేంటి నానిని అందరు ఇష్టపడతారు కదా. మరి అలాంటి నానిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనే కదా మీ అనుమానం. ఏం లేదండి, నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. నాని పుట్టిన రోజునాడు ఓ టీజర్‌ను కూడా విడుదల చేశారు. గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ పేరుతో గతంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.
దీంతో మెగా అభిమానులు మా హీరో టైటిల్‌ను నువ్వు పెట్టుకోవాడినికి వీల్లేదని నానిని ట్రోల్ చేస్తున్నారు మెగా అభిమానులు. తాజాగా ఈ వివాదంపై స్పందించాడు నాని. అతను నటించిన జెర్సీ మూవీ విడుదల సందర్భంగా మెగా ఫ్యాన్స్‌తో గొడవ గురించి వివరించాడు. గ్యాంగ్ లీడర్ సినిమా అంటే నాకు చాలా ఇష్టమని, కాని మెగాస్టార్ గ్యాంగ్ లీడర్‌కు మా సినిమాకు ఎటువంటి పోలిక ఉండదని చెప్పి మెగాఫ్యాన్స్‌ను సర్థి చెప్పే ప్రయత్నం చేశాడు.ఇక సినిమా కథకు కరెక్ట్ గా ఆ టైలిల్ సరిపోతుందని చెప్పిన నాని సినిమా చూసిన తరువాత ఆ విషయం ఇంకా క్లారిటీగా అర్థమవుతుందని కూల్ గా వివరణ ఇచ్చాడు.
- Advertisement -
మెగా ఫ్యాన్స్‌కు సర్థిచెబుతున్న నాని
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -