Saturday, May 10, 2025
- Advertisement -

ఎన్టీఆర్ కి సోమవారం ఆఖరి ఛాన్స్ !

- Advertisement -

ఎన్టీఆర్ కొత్త సినిమా నాన్నకు ప్రేమతో గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది. తన సినిమా ప్రమోషన్ కోసం నాగార్జున షో నాన్నకు ప్రేమతో లో కూడా అడుగు పెట్టాడు ఎన్టీఆర్. ఈ సినిమా విడుదల ముందరే బాలయ్య తో క్లాష్ నడుస్తోంది ఎన్టీఆర్ కి. కోల్డ్ వార్ గా మారిన వీరి విభేదాలు విడుదల విషయంలో భగ్గుమన బోతున్నాయి.

బాబాయ్ కి పోటీగా సినిమా విడుదల చేసి మరీ నందమూరి హీరోలకి కోపం తెప్పించేలా కనిపిస్తున్నాడు తారక రాముడు. అంతా బాగానే నడుస్తోంది కానీ ఈ సినిమా సెన్సార్ కి మాత్రం వెళ్లకపోవడం ఇప్పుడు బయ్యర్ల లో కొత్త భయాలు నింపుతోంది. లేని పోనీ అనుమానాలకి తావిస్తోంది. ఎన్టీఆర్ ఫాన్స్ కూడా ఈ విషయంలో చాలా డీలాగా ఉన్నారు.

ఎవరి మాటా వినకుండా ఎన్టీఆర్ విడుదల ని 13 గా ప్రకటించేసాడు కానీ విడుదల నాలుగు రోజులు ఉన్నా ఇంకా సెన్సార్ సంగతి అసలు తేల్చనే లేదు. ఈ విషయమై తీవ్ర చర్చ మొదలవుతోంది ఈ మధ్య కాలంలో. ఇవాళ సెన్సార్ కి వెళుతుంది అని అనుకున్న సినిమా ఇంకా వెళ్ళలేదు.

ఇక సోమవారం ఒక్క రోజే ఎన్టీఆర్ కి ఆఖరి రోజు గా చెప్పాలి ఆ రోజు తప్పితే సెన్సార్ కష్టం. సో ఎట్టి పరిస్థితుల్లో సెన్సార్ ని సోమవారమే పూర్తి చెయ్యాల్సి ఉంది మరి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -