రాంచరణ్ తాజా చిత్రం రంగస్థలం సినిమా గురించి ఇంక చర్చలు నడుస్తునే ఉన్నాయి.ఈ సినిమాలో రాంచరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. ప్రముఖులు కూడా ఈ సినిమా అభినందించారు. దర్శకధీరుడు రాజమౌళి,మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా చాలా మంది సినిమాను అభినందించారు.తాజాగా వీరి జాబితాలోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ కూడా చేరారు.ఆయన రంగస్థలం సినిమాను చూసినట్లు తన ట్వీట్టర్ ద్వారా తెలిపారు. ‘రంగస్థలం’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించినందుకు రామ్‌చరణ్, సుకుమార్‌కు ధన్యవాదాలు.
సినిమా చూసిన చాలా సేపటివరకు ఆ పాత్రలు మనతోనే ఉండిపోతాయి. గ్రేట్ వర్క్ గాయ్స్’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు రామ్‌చరణ్ ఫేస్‌బుక్ ద్వారా స్పందిస్తూ..‘థాంక్యూ నారా లోకేశ్ గారూ’ అని పేర్కొన్నారు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. రాంచరణ్ కెరీర్‌లో బిగెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా 200 కోట్ల క్లబ్‌లో చేరినట్లు చిత్రం బృందం తెలిపింది.