Friday, May 9, 2025
- Advertisement -

ఎన్టీఆర్ మామ‌పై ఫైర్ అయిన‌ నారా రోహిత్‌

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌ల వేడి సినిమా వాళ్ల‌ను తాకింది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఎవ్వ‌రికి న‌చ్చిన పార్టీలో వారు చేరుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పిల్లానిచ్చిన మామ నార్నే శ్రీనివాస‌రావు ఇటీవ‌లే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవ‌ల ఆయ‌న ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చంద్ర‌బాబు ఫ్యామిలీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తమ్ముడు రామమూర్తి నాయుడిని పట్టించుకోకుండా దూరం పెట్టారని ఈ ఇంట‌ర్య్వూలో నార్నే శ్రీనివాస‌రావు చెప్పుకొచ్చారు.

త‌మ ఫ్యామిలీ గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు చేసిన ఆరోపణలపై హీరో నారా రోహిత్ ఫైర్ అయ్యాడు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా మధ్య విబేధాలు సృష్టించకండి అంటూ ఓ లేఖ రాశారు. ప్ర‌జ‌ల‌ను ఎలా చూసుకుంటున్నారో , మమ్మ‌ల్ని కూడా అలానే చూసుకుంటున్నార‌ని చెప్పుకొచ్చాడు రోహిత్‌. మా పెదనాన్న, నాన్నల మధ్య విబేధాలు ఉన్నాయని చెప్పడం బాధాకరమని అన్నారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్య విబేధాలు సృష్టించడం తప్పని అన్నారు. చంద్రబాబు నాయుడును రాజకీయంగా ఎదుర్కోన‌లేక ఇలాంటి అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని , ఇలాంటి వారు చేసే కామెంట్స్ గురించి ప‌ట్టించికోవాల్సి అవ‌స‌రం లేద‌ని రోహిత్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -