Sunday, May 5, 2024
- Advertisement -

ఆ స్టేటస్ కోల్పోతున్న నాని

- Advertisement -

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కొత్త చిత్రం గ్యాంగ్ లీడర్ విషయం లో అటు సంతోషం గా, అలాగే బాధ గా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కి ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రం గా నే జరిగాయి అని చెప్పుకోవచ్చు. నాని ఈ సినిమా ని బాగా నమ్మాడు అనేది వాస్తవం. అయితే నాని కి మంచి పేరే వచ్చింది కానీ అనుకోకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అది రిఫ్లెక్ట్ కాలేదు. ఈ సినిమా కలెక్షన్స్ ఆశించిన స్థాయి లో లేవు. ఈ సినిమా ప్లాప్ దిశగా అడుగులు వేస్తుంది. పట్టుమని వారం రోజులు కూడా ఈ సినిమా థియేటర్ల దగ్గర సరిగా ఆడలేదు.

ఇక ఈ సినిమా కలెక్షన్స్ పడిపోవటానికి మరొక కారణం గద్దలకొండ గణేష్ అనే సినిమా కి హిట్ టాక్ రావడం. 29 కోట్లకి ఈ సినిమా అమ్ముడుపోయింది అని తెలుస్తుంది కానీ ఇప్పుడు భారీ గా బయ్యర్లు నష్టపోనున్నారు అని తెలుస్తుంది. నాని కి గత చిత్రాలు కూడా ఆశించిన స్థాయి లో ఆడకపోవడం ఒక దెబ్బే అని చెప్పుకోవచ్చు.

ఒకప్పుడు నాని అంటే మినిమమ్ గారెంటీ హీరో అనే వాళ్ళు. ఇప్పుడు ఈ పరాజయం తో నాని ఆ స్టేటస్ ని కోల్పోవసిన స్థితి వచ్చింది అని కొందరు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -