Sunday, May 12, 2024
- Advertisement -

సమంత చెల్లెలు కూడా ఇప్పుడు హీరోయిన్ గా..!

- Advertisement -

సినీ పరిశ్రమలో హీరోయిన్స్ రావడం.. వారు ఫాపులర్ అయితే వారి చెల్లెళ్లను దించడం జరుగుతునే ఉన్నాయి. కాజల్ అగర్వాల్ యాక్టర్ అయ్యక ఆమె చెల్లె నిషాని హీరోయిన్ గా పరిచయం చేసింది. తాప్సీ చెల్లెలు షగున్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఇవన్ని ఓకే కానీ సమంత చెల్లెలు హీరోయిన్ ఏంటి.. అసలు సమంతకు చెల్లెలు ఉందా అనుకుంటున్నారు.

అయితే సమంత చెల్లెలు హీరోయిన్ అవ్వడం నిజమే కానీ.. రియల్ సిస్టర్ కాదు రీల్ సిస్టర్.. అత్తారింటికి దారేది సినిమాలో సమంత, ప్రణితలకు చెల్లెలుగా నటించిన నవికాకోటియా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన శంకర్ .. ఇప్పుడు హీరోగా మారి డ్రైవర్ రాముడుగా రాబోతున్నాడు. ఈ మూవీలో శంకర్ సరసన నవికా కనపడబోతుంది. శంకర్ స్పూఫ్ లతో ఈ సినిమా ఫుల్లీ ఎంటర్టైనర్ గా ఉంటుందట.

నవికా బుల్లితెర మీద యాక్ట్ చేసింది.అటు తమిళంలో కూడా విజయ్ థేరీ సినిమాలో మంచి క్యారెక్టర్ లో యాక్ట్ చేసింది. గతంలో కాజల్ రీల్ సిస్టర్ రీతూవర్మ పెళ్లి చూపులు తో హిట్ కొట్టి తర్వాత విక్రమ్ సరసన ఛాన్స్ కొట్టేసింది.రీతూ వర్మ బాద్ షా సినిమాలో కాజల్ కి కజిన్ సిస్టర్ గా నటించింది. సమంతా సిస్టర్ నవికా మరి ఏ మేరకు హీరోయిన్ గా కొనసాగుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -