Sunday, May 19, 2024
- Advertisement -

నయనతార సినిమా కి కోర్టులు చిక్కులు

- Advertisement -

గతం లో ప్రకటించిన విధం గా నయనతార కొత్త చిత్రం కొలయుతీర్ కాలం జూన్ 14 న విడుదల కావాల్సి ఉంది. చాలా మంది మీడియా లో తమన్నా ఖామోష్ చిత్రానికి ఈ నయనతార చిత్రానికి పోలికలు ఉన్నాయి అని కూడా రాసారు. కానీ ఏమైందో ఏమో కానీ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాలేదు. ఈ సినిమా నిర్మాతలు ఈ సినిమా విడుదల చేయడానికి చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.

అయితే సినిమా విడుదల అవుతుంది అని భావించి నయనతార తరపున ఆమె బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ సోషల్ మీడియా లో పోస్ట్ కూడా చేశారు. అయితే మద్రాస్ హై కోర్ట్ ఈ సినిమా విడుదల మీద ఇంటరిం ఇంజంక్షన్ విధించింది అని తెలుస్తుంది. జూన్ 22 వరకు ఈ సినిమా విడుదల కాకుండా కోర్ట్ స్టే విధించింది అని తెలుస్తుంది. ఈ సినిమా తమిళ రచయిత సుజాత రాసిన ఒక నవల కి ఆధారం గా తెరకెక్కించబడింది అని ఆరోపణలు రావడం తో ఈ సినిమా ఇప్పుడు కష్టాల బారిన పడింది.

అయితే ఈ సినిమా కి సంబంధించి పూర్తి వివరాలు, కొత్త విడుదల తేదీ త్వరలో రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -