Friday, April 26, 2024
- Advertisement -

ప్రభాస్ కి అది నెగటివ్ పాయింట్ కానుందా?

- Advertisement -

స్టార్ డం వచ్చే కొద్దీ హీరోలకి తమ సినిమాల పైన పట్టు కూడా పెరుగుతూ ఉంటుంది. మహేష్ బాబు దగ్గర నుంచి ఈ విజయ్ దేవరకొండ వరకు దాదాపు అందరూ తమ సినిమాలలో ప్రతి ఒక్క విషయం పై జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉంది అన్న విషయం దగ్గర్నుంచి సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయం వరకు ప్రతి దానిపై హీరోల చేయి ఉంటుంది. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం అది జరగడం లేదు. ప్రభాస్ మెతక మనిషి అని అందరికీ తెలిసిన విషయమే. అదే ఇప్పుడు అతనికి నెగిటివ్ పాయింట్ గా మారిందని కొందరు అనుకుంటున్నారు. దీనికి ఉదాహరణ ‘సాహో’ సినిమా విడుదలకు ముందు వచ్చిన అవాంతరాలే.

ప్రభాస్ పూర్తిగా దర్శకనిర్మాతలపై ఆధారపడుతున్నాడు తప్ప తన సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయింది. బడ్జెట్ కాస్తా పెరుగుతూ వచ్చింది. సరే విడుదల తేదీ ఫిక్స్ అయింది అనుకుంటే అది కూడా ఇప్పుడు వాయిదా పడింది. ఇక సంగీతం దర్శకులు విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముందుగా శంకర్-ఎహసాన్-లాయ్ అందించాల్సిన సంగీతం బోలెడు చేతులు మారి ఇప్పుడు గిబ్రాన్ చేతికి అందింది. ఒకవైపు ‘సాహో’ సినిమా ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30కి వాయిదా పడినప్పటికీ ప్రభాస్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం అభిమానులను మరింత నిరాశ పరుస్తోంది. ఏదేమైనా ప్రభాస్ మెతక బిహేవియర్ తన కెరియర్ కు మైనస్ పాయింట్ గా మారే అవకాశాలు ఉన్నాయని అభిమానులు చింతిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -