రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో నటించింది. మహేశ్ బాబు, ఎన్టీఆర్,రామ్ చరణ్, బన్ని వంటి హీరోలతో నటించింది. తమిళంలో సూర్య, కార్తీ, విశాల్ వంటి హీరోలతో నటించి అక్కడ కూడా మెప్పించింది. అయితే ఇండస్ట్రీలో కొత్త భామలు రాక ఎక్కువైంది. పూజా హెగ్డె, రష్మిక వంటి హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో రకుల్‌కు అవకాశాలు బాగా తగ్గిపోయాయి.
రకుల్ చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదు. దీంతో ఎలాగైనా జనాల్లో నేను ఉన్నానని గుర్తు చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. జిమ్‌లో కష్టపడుతున్న హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ఇప్పుడు చేతితో ఒక్క సినిమా కూడా లేకుండా జిమ్‌లో ఖాళీగా ఫోటోలకి ఫోజులివ్వడంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.చేతిలో సినిమాలు లేకపోతే ప్రతి ఒక్కరికి ఇదే గతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
- Advertisement -
సినిమాల్లో అవకాశాలు లేకపోతే ఇదే గతా…?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -