Sunday, April 28, 2024
- Advertisement -

టీడీపీ మ్యానిఫెస్ట్… సోషల్ మీడియా ట్రోల్స్…

- Advertisement -

రాజమండ్రిలో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తెలుగుదేశం మహానాడు కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని విడుదల చేశారు. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మిని మ్యానిఫెస్ట్ రూపొందించారు. ఈ మిని మ్యానిఫెస్ట్ లో నిరుద్యోగులకు, మహిళలకు, రైతులు, బీసీలకు పెద్దపేట వేశారు.

మహిళ ‘మహా’ శక్తి: 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపడుచులకి “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ.
తల్లికి వందనం: ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000.
దీపం: ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితం.
ఉచిత బస్సు ప్రయాణం: బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ.
రిచ్ టూ పూర్: పేదలను సంపన్నులను చేసే విధంగా.. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా ప్రణాళికలు.
ఇంటింటికీ మంచి నీరు: ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్.
అన్నదాత: ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం.
యువగళం నిధి: ప్రతి నిరుద్యోగికి నెలకు 2500 రూపాయలు.
బీసీలకు రక్షణ కలిపించేలా చట్టాం.

అయితే 2014లో టీడీపీ పథకాలు వాటి అమలు తీరును వివరిస్తు సోషల్ మీడియా ట్రోల్స్ ఊపందుకున్నాయి.
2014 ఎన్నికల్లో 450కి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారని.. మేనిఫెస్టో ను పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించాఅని.. సోషల్ మీడియా ట్రోల్స్ ఊపందుకున్నాయి. 14 వేల కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తా అని చెప్పి ఓట్లు దండుకొని 2014 లో సీఎం అయినా బాబు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు.

నిరుద్యోగ భృతి కూడా అటకెక్కింది. 2014 జూన్ నుండి నిరుద్యోగ భృతి 2000 రూపాయలు హామీని అమలు పరచకుండా.. 2019 ఎన్నికల ప్రక్రియ ముందుగా 2018 డిసెంబర్ లో 1000 రూపాయలు చొప్పున ఇచ్చి.. విమర్శలకు వెరసి 2019 జనవరిలో డిసెంబర్ బకాయి 1000 కలిపి 3000 ఇచ్చి తర్వాత ఏప్రిల్ వరకూ 2000 రూపాయలు చొప్పున ఐదు నెలలు మాత్రమే అమలు చేశారు. అయితే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే 3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడు 2500 రూపాయలు ఇస్తామంటున్నారు అంటు ట్రోల్స్ చెస్తున్నారు.

మరోపక్క పథకాలు అన్ని కాపీ
తల్లికి వందనం- ఏడాదికి రూ.15,000 — ఇది జగనన్న అమ్మఒడి.
దీపం- ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు — ఇది కర్నాటకలో బీజేపీ ఇచ్చిన హమీ..
మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం— ఇది కర్నాటకలో కాంగ్రెస్ పథకం..
ఇలా చివరికి పధకాలు కూడా సొంతంగా కాకుండా కాపీ కొడుతున్న మన విజనరీ కాపీ క్యాట్ అంటూ ట్రోల్స్ చెస్తున్నారు.

-Anjanreddy kodathala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -