Monday, May 5, 2025
- Advertisement -

ఛాంబర్లోని నమోదైన ఈ టైటిల్స్ చూశారా గురు..

- Advertisement -

ఫిలిం ఛాంబర్లో రిజిస్టరయ్యే టైటిల్స్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక్కడ రిజిస్టరయ్యే టైటిల్స్ ను ఎవరు ఎవరితో చేయించారు అనే విషయాలను గోప్యంగా ఉంచుతారు. కాని బడా ప్రొడక్షన్ హౌస్ లు తాజాగా రిజిస్టర్ చేసిన టైటిల్స్ వింటే ఆశ్చర్యం కలగక మానదు. నేనే రాజు నేనే మంత్రితో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన తేజ… ఆటనాదే వేట నాదే అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. తేజ ఇపుడు వెంకీతో సినిమా చేస్తున్నాడు కాబట్టి..ఆ సినిమా పేరు వెంకీ కోసం రిజిస్టర్ చేసిందనే అనుకోవచ్చు. సురేష్ ప్రొడక్షన్ దీనిని రిజిస్టర్ చేసినట్లుంది. ఇదే ప్రొడక్షన్ హౌస్ క్రిష్ణ అండ్ హిస్ లీలా అనే టైటిల్ ను కూడా ఎన్ రోల్ చేయడం విశేషం.

అలాగే రామ్ గోపాల్ వర్మ… చాలా టైటిల్స్ ను రిజిస్టర్ చేశాడని తెలుస్తుంది. అది కూడా రకరకాల బ్యానర్లపై ఇలా రిజిస్టర్ చేయించడం విశేషంగా చెపుకోవాలి. వాటిలో గన్ ,సిస్టమ్ ,శపధం, లాంటి టైటిల్స్ ఉన్నాయి. ఇపుడున్న టైమ్లో తాము అనుకుంటోన్న కథకు తగ్గ టైటిల్ సినిమా షూట్ అయ్యాక పెడదామంటే ఆ పేరు ఉండకపోవచ్చు. అందుకనే దిల్ రాజు తో సహా ఎవరికి వారు ముందుగానే తమ సినిమాలకు ముందుగానే పేర్లు పెట్టేసుకుని వాటిని ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయిస్తున్నారు.

తాజాగా రిజిస్టరైనా కొన్ని సినిమాల పేర్లు చూద్దాం.
SVCC – Raju Gari Abbayi
Sridevi Art Productions – Anucharudu
GA2UV – Taxiwala
SRT Ent – Nela Tickettu
Purandhershwari – Jana Senudu

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -