Tuesday, May 14, 2024
- Advertisement -

క్షణం దర్శకుడి సినిమా… సురేష్ ప్రొడక్షన్స్ డిలే?

- Advertisement -

రవికాంత్ పేరెపు అనే యువ దర్శకుడు క్షణం అనే సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో కి వచ్చాడు. మొదటి సినిమా తోనే పెద్ద విజయం అందించిన రవికాంత్ అడివి శేష్ కి తన కెరీర్ లో తిరిగి చూసుకో రావాల్సిన అవసరం లేకుండా చేసాడు. అయితే మొదటి సినిమా తర్వాత రవికాంత్ కి చాలా మంది నిర్మాణ సంస్థలు సినిమాలు ఆఫర్ చేస్తే తాను మాత్రం రానా సురేష్ ప్రొడక్షన్స్ లో ఇచ్చిన ఒక అవకాశాన్ని అందుకున్నాడు. నిజానికి వెంకటేష్-నాగ చైతన్య మల్టీ స్టారర్ ముందుగా రవికాంత్ వద్దకు కూడా వెళ్ళింది కానీ అనివార్య కారణాల వలన రవికాంత్ ని తప్పించి ఈ యువ దర్శకుడికి వేరే సినిమా ఛాన్స్ ఇచ్చారు.

ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది కానీ ఈ సినిమా ఇంకా విడుదలకి నోచుకోవడం లేదు. ఒక రొమాంటిక్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవికాంత్ సినిమా నిర్మాణాంతర పనుల్లో ఉంది. అయితే ఇది గత ఏడాదే విడుదల కావాల్సిన చిత్రం. కాకపోతే మళ్ళీ రీ షూట్స్ చేసి రావడం తో ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ని సురేష్ ప్రొడక్షన్స్ ఇంకొంత డిలే చేస్తుంది అనే వార్తలు ఎక్కువ అయ్యాయి.

ఈ సినిమా లో సిద్ధూ జొన్నలగడ్డ, శ్రద్దా శ్రీనాథ్ లు నటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -