- Advertisement -
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం వినయ విధేయ రామ. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. కియారా అద్వానీ రామ్ చరణ్ పక్కన తొలిసారి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్,సాంగ్స్‌కు మంచి స్పందన లభించింది. న్యూ ఇయర్ వేడుక సందర్భంగా సినిమా నుంచి మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ భూజాలపైకి ఎక్కే ప్రయత్నం చేస్తోంది కియారా అద్వానీ. ఈ పోస్టర్‌ను చూస్తుంటే ఏదో సాంగ్‌లో వచ్చే డ్యాన్స్ బిట్‌లా అనిపిస్తుంది. తన కుటుంబానికి ఆపద వచ్చినప్పుడు వినయ విధేయ రాముడు ఏం చేస్తాడు అనే పాయింట్ మీద రూపొందిన ఈ మూవీ జనవరి 11న విడుదల కానుంది. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!