- Advertisement -
అమెరికాలో త్వరలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలపై ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించారు. ఆ ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ నటులు, క్రీడాకారులు స్పందించడం మామూలే. అయితే రేణు దేశాయ్ మాత్రం మహిళల కోణం నుంచి స్పందించడం విశేషం.
ఈ ఎన్నికలకు ముందు జరిగే ప్రాధమిక ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలుపొందడం తనకు ఆనందంగా ఉందని రేణు దేశాయ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ అమెరికాకు మహిళా అధ్యక్షురాలు లేరని, ఆ లోటు హిల్లరీతో తీరే అవకాశం ఉందని రేణు అభిప్రాయపడ్డారు. అలాగే ప్రపంచంలో అన్ని దేశాలకు మహిళా అధ్యక్షురాళ్లు ఉన్నారని, అమెరికాకు మాత్రం ఇదే తొలిసారి అవుతుందని రేణు తెలిపారు. ఆమె ట్విట్ పై అభిమానులు, పలువురు మహిళలు పాజిటివ్ గా స్పందించారు.