Monday, April 29, 2024
- Advertisement -

రెండో పెళ్లిపై గుడ్ న్యూస్ చెప్పిన రేణు!

- Advertisement -

తన రెండో పెళ్లిపై ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడించారు నటి రేణు దేశాయ్. పవన్‌తో బ్రేకప్ తర్వాత చాలా కాలంగా రేణు రెండో పెళ్లిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ మధ్య తెగ హడావిడి చేస్తూ ఓ వ్యక్తితో కలిసి ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది. అయితే ఈ ఫోటోలో తనకు కాబోయే భర్త మొహాన్ని దాచేసి ఎంగేజ్‌మెంట్ అయిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇది రెండేళ్ల క్రితం ముచ్చట. దీంతో రేణు పెళ్లి ఎప్పుడా ఎప్పుడా అని అంతా ఎదురుచూస్తుండగా తాజాగా అప్‌డేట్ ఇచ్చేసింది.

రెండో పెళ్లి కోసం తాను ఎంతగానో వెయిట్ చేస్తున్నానని…పిల్లలకు కూడా తాను చేస్తున్న పని నచ్చిందని తెలిపింది. సంతోషంగా ఉంటావ్ అంటే.. హ్యాపీగా పెళ్లి చేసుకో మమ్మీ అని వాళ్లు సపోర్టు చేస్తున్నారని తెలిపింది. ఒంటరితనం ఎవరికైనా బాధగానే ఉంటుందని..ఇలాంటి సమయంలో తనకు ఓ తోడు దొరికిందని తెలిపింది. అతడు తనను బాగా చూసుకుంటాడని నమ్మకం ఉందని…త్వరలోనే శుభవార్త చెబుతానని తెలిపింది.

ఇక తనకు కాబోయే భర్త ఓ ఐటీ కంపెనీ మేనేజర్‌ అని, గతంలో అమెరికాలో జాబ్ చేసేవాడని, తన తండ్రికి ఆరోగ్యం స‌రిగా లేకపోవడంతో భారత్‌కు వచ్చి పూణేలో జాబ్ చేస్తున్నాడని వెల్లడించింది. ప్రస్తుతం చిన్న సినిమాలు చేస్తున్న రేణు…రవితేజ టైగర్‌ నాగేశ్వరరావులో కీ రోల్ పోషిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -