అజయ్ కౌండిన్య అనే దర్శకుడు తెరకెక్కించిన ‘ఎన్‌హెచ్ 47లో బూత్ బంగ్లా’ అనే చిత్రం ఆడియో ఫంక్షన్ ఇటీవలే జరిగింది. సినిమా ఇండస్ట్రీ మీద, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నటి రోజా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద సంచలన కామెంట్స్ చేశారు. దీంతో పాటు నటి గాయిత్రి గుప్తా మీద కూడా ఫైర్ అవ్వడంతోపాటు వల్గర్ కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
రోజాపై ఆయన కామెంట్స్… రోజా గారు మా అమ్మలాంటి వారు, సీనియర్ యాక్టర్… ఆమెకు మా పాదాభివందనం అంటూనే నీచమైన కామెంట్స్ చేశారు. రాజకీయాల గురించి మాట్లాడే రోజా సినిమా ఆర్టిస్టుల సమస్యలమీద మాట్లాడటంలేదని ఫైర్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ విదేశీ ఆర్టిస్టును పెట్టి సినిమా తీశారు. విదేశీ ఆర్టిస్టును పెట్టే బదులు రోజా గారిని పెట్టి తీస్తే సూపర్ గా ఉండేది. ఇప్పటి కైనా రోజా గారు ఒప్పుకుంటే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పార్ట్ 1 సినిమా తీస్తాను…. అంటూ అజయ్ కౌండిన్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి, రెండు మన సీనియర్ యాక్టర్ రోజా గురించి, మూడు మన వపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, నాలుగు ఆడ మగ తేడా తెలియని అమ్మాయి గాయిత్రి గుప్తా గురించి ఈ రోజు నేను మాట్లాడదలుచుకున్నాను…. అంటూ దర్శకుడు కౌండిన్య మొదలు పెట్టారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర విభజన అయిన వెంటనే రాచకొండలో రెండు వేల ఎకరాల్లో ఫిలింసిటీ కడతామని ప్రకటన చేశారు. సినిమా కళాకారులకు, టెక్నీషియన్లకు 5 లక్షల హెల్త్ కార్డులు, డబుల్ బెడ్రూంలు అనౌన్స్ చేశారు. కానీ మన పాగల్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం దాని జీవో సాంక్షన్ చేయించలేదంటూ మంత్రిపై కామెంట్లు చేశారు.సినిమా ఫీల్డ్ నుండి ప్రతి ఏడాది ప్రభుత్వానికి రూ. 200 కోట్ల వరకు టాక్సులు కడుతున్నాం. మూడు సంవత్సరాలుగా 600 కోట్లు కట్టాం. కానీ మాకు మాత్రం హెల్త్ కార్డులు లేవు, డబల్ బెడ్రూంలు లేవు. రాచకొండ ఫిల్మ్ సిటీ జీవో కూడా సాంక్షన్ కాలేదు…. అంటూ అజయ్ కౌండిన్య మండి పడ్డారు.
సినిమా ఫీల్డులో 2 లక్షలకు పైగా టెక్నీషియన్స్, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద మనుషులు ఎందరో ఉన్నారు. చిత్రపురి కాలనీలో, కృష్ణా నగర్లో అవకాశాలు లేక తిండి తిప్పలు లేక చస్తున్నారు. ప్రశ్నించడానికి జనసేన పార్టీ పెట్టినపుడు మా ఇండస్ట్రీలో ఉండే సమస్యలు ప్రశ్నించడానికి కనిపించడం లేదా? చిన్న సినిమాల నిర్మాతలు థియేటర్లు దొరకక, రెంట్లు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.
పనిలో పనిగా ఫ్యాన్స్‌కుకూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ సమస్య మా సినిమా ఫీల్డుకు సంబంధించిన సమస్య. ఈ సమస్య గురించి మీరెవరైనా తప్పుగా ఆలోచించి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఐయామ్ సోలో…. నన్నెవ్వడేం పీకలేడు. ఎవరైనా మాట్లాడితే గుడ్డలిప్పదీసి గొడ్డుకారం వేసి కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈవ్యాఖ్యుల ఇండస్ట్రీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.