Tuesday, April 30, 2024
- Advertisement -

పాపం! బాయ్‌ఫ్రెండ్ ఒక్క ముద్దు కూడా పెట్ట‌లేద‌ట‌

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పెళ్లికి రెడీ అయింది.గ‌త కొంత కాలంగా ప్రియాంక చోప్రా అమెరికా పాప్ సింగ‌ర్ నిక్ జొనాస్‌తో డేటింగ్ చేస్తున్న సంగ‌తి అందరికి తెలిసిందే.వీరి ప్రేమ‌కు ఇరు కుటుంబాలు అంగీక‌రించ‌డంతో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు.ఇప్పటికే సంగీత్, మెహందీ వేడుకలు కూడా పూర్తయ్యాయి. తాజాగా ప్రియాంక చోప్రా ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు త‌న ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. మెట్ గాలా వేడుకలో తనను చూసిన తరువాత ట్విట్టర్ లో డైరెక్టుగా మెసేజ్ ని పెడుతూ, ‘నిన్ను కలవాలని అనుకుంటున్నా’ అని నిక్ అన్నాడని గుర్తు చేసుకుంది. ట్విట్టర్ లో అయితే, సోషల్ మీడియాకు తెలిసిపోతుందన్న ఉద్దేశంతో తన పర్సనల్ నంబర్ ను ఇచ్చానని, ఆపై పలుమార్లు పార్టీల్లో కలుసుకున్నామని తెలిపింది.

తాను న్యూయార్క్ పర్యటనలో ఉండగా, తన అపార్ట్ మెంట్ కు నిక్ ను పిలిచానని, ఆ సమయంలో తను ఎంతో మర్యాదగా నడుచుకున్నాడని చెప్పింది. కాసేపు మాట్లాడాక వెళ్లొస్తానని వెళుతూ కనీసం ముద్దు కూడా పెట్టలేదని తెలిపింది ప్రియాంక‌. ఈ విష‌యంలో నిక్‌పై ఇప్ప‌టికి కోపంగానే ఉన్నాన‌నంటూ చెప్పుకొచ్చింది.నిక్ ప్ర‌పోజ్ చేసిన రోజుని ఎప్ప‌టికి మ‌ర‌చిపోలేన‌ని,త‌న ప్ర‌పోజ్‌ల‌ను ఎంతో ఆనందంగా అంగీక‌రించిన‌ట్లు తెలిపింది.ఇక వీరి పెళ్లి శనివారం నాడు హిందూ సంప్రదాయంలో, ఆదివారం నాడు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం జరుగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -