పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగా ఫ్యాక్షన్ ఏది జరిగిన అక్కడ పవన్ కల్యాణ్ అభిమానులు చేసే హంగామా అంత ఇంత కాదు. పవన్ స్టార్ , పవర్ స్టార్ అంటూ అభిమానులు అరుస్తు స్లొగన్స్ ఇస్తుంటారు. అయితే ఈ అభిమానం హద్దులు దాటిన పరిస్థితులు చాలానే ఉన్నాయి. గతంలో పవన్ అభిమానులపై మెగా బ్రదర్ నాగబాబు మండిపడ్డారు. వారికి స్టేజీపైనే గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు నాగబాబు. తాజాగా మరోసారి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై ఫైర్ అయ్యారు మెగా డాటర్ నిహారిక.
నిహారిక హీరోయిన్‌గా నటించిన ‘సూర్యకాంతం’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిహారిక ఓ కాలేజీకి వెళ్లింది.అక్కడ పవన్ అభిమానులు రచ్చ రచ్చ చేశారు. . పవన్ స్టార్ , పవర్ స్టార్ అంటూ స్లొగన్స్ ఇచ్చి నానా హంగామా చేశారు. దీంతో నిహారిక కొంత అసహానానికి గురి అయింది. నాకు చాలా రోజుల నుండి ఒక డౌట్ ఉంది. “పవర్ స్టార్ అంటే మీకేమొస్తుంది?” అని అడిగింది. ఇక్కడ ఉత్సాహంగా పవర్ స్టార్ అని అరిచేవాళ్ళు జనసేనకు ఓటు వెయ్యాలని.. అలా చేస్తే పవన్ సీమ్ అవుతారని వాళ్ళకు సలహా ఇచ్చింది.
- Advertisement -
పవన్ ఫ్యాన్స్‌పై మండిపడ్డ నిహారిక
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
