Friday, May 3, 2024
- Advertisement -

నిహారిక‌కు పెళ్ల‌యిపోయిందంట‌…

- Advertisement -

మెగా ఫ్యామిలీలో నిహారిక ఒక్క‌టే హీరోయిన్‌గా అయ్యింది. తెలుగులో తొలి సినిమా ‘ఒక మ‌న‌సు’ ప‌రాజ‌యం చెంద‌డంతో త‌మిళ్‌కు వెళ్లింది. అక్క‌డ ఓ సినిమా చేస్తోంది. దాని త‌ర్వాత తెలుగులో సుమంత్ అశ్విన్ స‌ర‌స‌న ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమా చేస్తోంది. ఆ సినిమాలో నిహారిక‌కు పెళ్ల‌యిపోయింద‌ని తెలుస్తోంది. ఆమె నటిస్తున్నసినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌‌గా ఈ సినిమా లక్ష్మణ్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌ల ముగిసింది. ఈ విష‌యాల‌ను నిహారిక ట్విట‌ర్‌లో వెల్ల‌డించింది.

ప్రేమ- పెళ్లి ఇతివృత్తంతో కుటుంబ కథా చిత్రంగా హ్యాపీ వెడ్డింగ్ సినిమాను తీస్తున్నారు. అబ్బాయి, అమ్మాయి పట్ట‌ణంలో చదువు, ఉద్యోగం.. పెళ్లి మాత్రం తమ కుటుంబం సొంత ఊరైన పల్లెటూరిలో చేసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న ఇద్ద‌రి మ‌ధ్య సినిమా అని తెలుస్తోంది. పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండ‌డంతో అంచ‌నాలు భారీగా పెరిగాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -