- Advertisement -

కిరాక్ పార్టీ ఇస్తోన్న హీరో నిఖిల్

- Advertisement -

నిఖిల్ టైమ్ భలే నడుస్తోంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మనోడికున్న ఎనర్జీతో సినిమాలను లాక్కుంటూ వస్తోన్న నిఖిల్ బాబు తాజాగా మరో అడుగు ముందుకేశాడు .కేవలం శంకరా భరణం చిత్రంతో ఈమధ్య ఫెయిల్యూర్ అందుకున్న ఈ కుర్రవాడు…ఇక మొహమాటంతో ఎలాంటి చిత్రాలు చేయకూడదని డిసైడ్ అయ్యాడు. అందుకే… కన్నడలో సూపర్ హిట్ అయిన కిరిక్ పార్టీ రైట్స్ తీసుకుని..దానిని కిరాక్ పార్టీగా మలచబోతున్నాడు.

పోస్టర్ చూస్తుంటే… కాలేజ్ క్యాంపస్ రాజకీయాలలో మనోడు చేసిన హడావిడి స్పష్టంగా కనిపిస్తుంది. ఓ లీడర్ గా ఎదిగిన వైనాన్ని చూపిస్తున్నారంటే.. ఆల్మోస్ట్ ఎగ్రిస్సివ్ పర్సనాలిటీ లుక్ ఇతడిలో హైలెట్ అవుతుంది. ఆ విధంగా చూసినప్పుడు గతంలో టాలీవుడ్లో వచ్చిన కొన్ని చిత్రాల తాలుకు ఫ్లేవర్ ను తీసుకుని ఇప్పటి పాలిట్రిక్స్ ను హైలెట్ చేస్తూ ఈ సినిమా తయారు చేయబోతున్నారని తెలుస్తుంది..

కన్నడలో విజయవంతమైనట్లుగానే ఈసినిమా తెలుగు రీమేక్ టాలీవుడ్లో సూపర్ గా వర్కవుట్ అవుతుందని నిఖిల్ అండ్ టీమ్ చెబుతుంది. సినిమాల సెలక్షన్ విషయంలో ఎంతో కేర్ ఫుల్ గా ఉండే నిఖిల్.. ఈసినిమాను కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మలుచుతున్నట్లు స్పష్టమవుతుంది. ఈమూవిని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.దర్శకత్వం మాత్రం నూతన దర్శకుడు శరన్ కొప్పిశెట్టి చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -