Sunday, May 5, 2024
- Advertisement -

ఆ హీరోయిన్ మీద ఇంట్రెస్ట్ పోతుంది….

- Advertisement -

తమిళం లో అరంగేట్రం చేసి క్రమక్రమం గా ఇప్పుడు తెలుగు లో అవకాశాలు దక్కించుకుంటున్న నటి నివేత పేతురేజ్, దుబాయ్ లో పుట్టి పెరిగిన ఈ భామ తెలుగు లో మెంటల్ మదిలో అనే సినిమా తో అరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా లో ఒక స్వతంత్రం గా బతికే అమ్మాయి పాత్ర లో మెరిసిన నివేత ఆ తర్వాత పెద్దగా మంచి పాత్రలు ఉన్న సినిమాలు దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాలో చేసిన అన్ని సినిమాల్లో పాత్రలు మొదటి సినిమా తరహా పాత్ర లాగే ఉంది. చిత్రలహరి లో చేసిన పాత్ర కూడా కొంచెం ఇంచుమించు అలానే ఉంది.

నిన్న విడుదల అయినా బ్రోచేవారెవరురా అనే సినిమా లో కూడా నివేత ఒక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా లో నివేత పాత్ర కూడా ప్రత్యేకంగా ఏమి లేదు కానీ ఆమె నుండి కొత్తదనం ఆశించే వాళ్ళకి మాత్రం నిరాశే. నివేత మంచి పెరఫార్మర్ కానీ తన పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర ని ఎంపిక చేసుకోవడం లో మాత్రం నివేత విఫలమవుతూ వస్తుంది. ఇలాగే ఇంకొన్ని సినిమాలు కుడా చేస్తే ఈ హీరోయిన్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది.

కాకపోతే ఇప్పుడు నివేత ఆశలు మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ సినిమా పైన ఉన్నాయి. ఈ సినిమా లో పాత్ర అయినా కొత్తగా ఉంటె, నివేత గట్టెక్కినట్టే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -