Saturday, April 20, 2024
- Advertisement -

నోయెల్ పై తప్పుడు ప్రచారం.. స్పందించిన తమ్ముడు..!

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 4లో నోయెల్ చాలా బాగా ఆడుతున్నాడు. హౌస్ లో రెండు సార్లు కెఫ్టేన్ అయ్యాడు. ర్యాప్ సింగర్ గానే కాకుండా నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో నోయల్ నటించాడు. అయితే హౌస్ లో నోయల్ సింపతీ కోసం సేఫ్ గేమ్ ఆడుతున్నడన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక రీసెంట్ గా హౌస్ మేట్స్ అందరూ కూడా తమ వ్యక్తిగత విషయాలను చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ నేపథ్యంలో నోయెల్ తన తల్లి ఇళ్లల్లో పని చేసేదని.. తండ్రి ఇస్త్రీ పని, కూలి పని ఇలా ఎన్నో చేస్తూ డబ్బులు సంపాదించేవాడని చెప్పాడు.

సోశల్ మీడియాలో నోయల్ గురించి సెర్చ్ చేస్తే.. నోయెల్ తండ్రి సామ్యూల్ రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి అని రాసి ఉంది. దీంతో నోయెల్ సింపతీ కోసం అబద్దాలు చెప్పాడంటూ అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ విషయంపై నోయెల్ తమ్ముడు జోయెల్ క్లారిటీ ఇచ్చాడు. తన అన్నపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కావాలనే ట్రోల్ చేస్తున్నారని అన్నాడు. తన అన్న చెప్పినట్లుగానే తమ తండ్రి ఇస్త్రీ పని చేసేవారని.. దానికి ప్రూఫ్ గా ఓ ఫోటోని షేర్ చేశారు. ఆ తరువాత డిఫెన్స్ రీసెర్చ్ లో జాబ్ రావడంతో అక్కడ జాయిన్ అయ్యారని చెప్పాడు.

అది కూడా ఆఫీసర్ ఉద్యోగం కాదని.. డీఆర్‌డీవోలో సెక్యూరిటీగా తమ తండ్రి పని చేశారని చెప్పాడు. అలానే నోయెల్ తమ తండ్రి గురించి చెబుతున్నప్పుడు జాబ్ ట్రైల్స్ లో ఉన్నప్పుడు ఇస్త్రీ పని చేసేవాడని క్లియర్ గా చెప్పాడని.. కానీ కావాలనే తప్పుడు సమాచారంతో ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక తన అన్న కోసం పీఆర్ టీమ్ పని చేస్తుందనే విషయంపై స్పందిస్తూ.. ఎలాంటి పీఆర్ టీమ్ లేదని.. అప్పుడప్పుడు తనే సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్న విషయాన్ని చెప్పాడు జోయల్.

కలర్ గురించి అవమానించారు : చాందిని

హీరో రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా..!

బాలయ్య సరసన నటించే ఈ బ్యూటీ ఎవరో తెలుసా ?

శంకర్ దాదా సక్సెస్.. హీరోలందరు కలిసిన వేళ.. ఫోటో వైరల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -