‘ఏ మంత్రం వేసావే’ సినిమా విజయ్ దేవరకొండకు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయినా ఏమాత్రం బాధలో లేకుండా విజయ్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ హీరోగా స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మెహరీన్ హీరోయిన్‌గా ఓ సినిమా రూపొందిస్తున్నారు. కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యహరిస్తున్న ఈ సినిమాకు ‘నోటా (నన్ అఫ్ ది ఎబో)’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఎవరూ నచ్చలేదని ఓటరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కోసం ఎన్నికల సంఘం నన్ ఆఫ్ ది ఎబౌ (నోటా)ని అమల్లోకి తెచ్చింది. ఇదే ఇతివృత్తంగా సినిమా తీస్తున్నారు. విజయ్ దేవరకొండ చిత్రం ఎన్నికల నేపథ్యంలో సాగే కథ అని అర్థమవుతోంది.
తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమాకు సి.ఎస్.శ్యాం సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేశారు. విజయ్‌దేవరకొండ ఖద్దరు చొక్కా వేస్కొని చూపుడు వేలు చూపిస్తున్నాడు. ఆ వేలుపై సిరా అంటించి ఉంది. అంటే ఓటేసి వచ్చినట్లు కనిపిస్తున్నాడు. ఆ ఓటు నోటాకే ఉండే అవకాశం ఉంది.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైంది. తప్పనిసరిగా ఓటు వేయాలని అవగాహన కల్పించేలా ఈ సినిమా ఉండేట్టు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఓటింగ్ రోజు అభ్యర్థులు ఎవరూ ఇష్టం లేకపోతే బ్యాలెట్‌లో చివరిగా పై వారెవరూ కాదు (నన్ ఆఫ్ ద అబొవ్ – NOTA) కాదు అనే అవకాశం ఉంటుంది.
టైటిల్‌ను బట్టి ఈ సినిమా పొలిటికల్ జోనర్‌లో సాగే సినిమాగా తెలుస్తోంది. విజయ్ చూపుడు వేలు కాకుండా మధ్య వేలు చూపిస్తుండడంతో ఓ బూతు అర్ధాన్నే ఇస్తోంది. అయితే దీనిపై విమర్శలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమా కూడా ఎంతో వివాదాస్పదమైంది. ఇది కూడా అలా అయ్యి సినిమా హిట్టయ్యేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ‘టాక్సీవాలా’ సినిమా శ్రీరస్తు.. శుభమస్తు ఫేం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది.