Saturday, May 18, 2024
- Advertisement -

చిరంజీవి ఎవరో నాకు తెలియదు – ప్రభాస్

- Advertisement -

ప్రభాస్.. రెబల్ స్టార్ నట వారుడుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తన పెదనాన్న ద్వారా వచ్చిన బాధ్యతను మోస్తూ.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. దర్శక ధీరుడు అద్భుత సృష్టి బాహుబలిలో నటించాక ప్రభాస్ ఖ్యాతి ప్రపంచానికి విస్తరించింది. తెలుగు సినిమా స్టామినా ఏంటో చూపించింది బాహుబలి.

ఈ సినిమాకి తన నటనతో ప్రాణం పోశాడు ప్రభాస్. అయితే తాను ఎంత ఎదిగినా ప్రభాస్‌లో కించిత్ గర్వం కూడా ఎవరికీ కనిపించదు. సినీ పరిశ్రమలో తనకంటే పెద్ద స్థాయిలో ఉన్నవారినైనా, క్రిందిస్థాయిలో ఉన్నవారినైనా డార్లింగ్ అని ఆప్యాయంగా పిలుస్తుంటాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రభాస్‌కు ఎంతో ఇష్టం. సినీ పరిశ్రమలో కంటే ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో చిరు అంటే ప్రభాస్‌కు అమితమైన ఇష్టం. చిరంజీవి కూడా ప్రభాస్ పైన అభిమానం చూపుతుంటారు. అందుకే బాహుబలి షూటింగ్ సమయంలో నేరుగా వెళ్ళి ప్రభాస్‌తో మాట్లాడి వచ్చారు చిరంజీవి.

చిరు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా గురించి స్నేహితులతో ప్రభాస్ మాట్లాడుతూ… కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఏ సినిమా ప్రారంభిస్తే ఆ సినిమా ముగిసేంత వరకు నేను ఆయన్ను ఆ క్యారెక్టర్ లోనే ఊహించుకుంటాను. కాబట్టి ఇప్పుడు నాకు చిరంజీవి అంటే ఎవరో తెలియదు.. నాకు తెలిసిన వ్యక్తి ‘సైరా నరసింహారెడ్డి’ అని స్నేహితులతో అన్నారట. చిరు పై తన ప్రేమను ప్రభాస్ ఇలా తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -