Wednesday, May 7, 2025
- Advertisement -

అర్చనకు బత్తాయితో మసాజ్ చేసిన శివబాలజీ

- Advertisement -

బిగ్ బాస్ షో ఫైనల్ దశకు వచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇక బిగ్ బాస్ లో ఉంగరాల రాంబాబు సందడి చేశారు. అందరితో సరదాగా సరదా ఎంజాయ్ చేశారు సునీల్.ఇక హరితేజ.. దీక్ష తనను పదే పదే మ్యాన్ఫులేట్ చేస్తున్నా అని ఆరోపించడంపై మండి పడింది.

ఇక బిగ్ బాస్ హౌస్ ను కోచింగ్ గా మార్చి.. దోసెలు వేయడం, వంటలు చేయడం నేర్పించిన శివబాలాజీని హరితేజ ఆటపట్టించింది. అలానే దీక్షకు కూడా దోసెలు ఎలా వేయాలో చూపించారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి.. ఇన్నిరోజులు అవుతుండగా.. ఇంటితో మీకు ఉన్న అనుబంధాన్ని పంచుకునే ఛాన్స్ ఇచ్చారు బిగ్‌బాస్. దీంతో హౌస్‌లో తమకు ఇష్టమైన ప్రదేశాన్ని, వస్తువుల గురించి ఒక్కక్కరు తమ మెమెరీస్‌ను చెప్పుకున్నారు. ఇక శివబాలజీ అర్చన వీపు నొప్పును మటుమాయం చేసేందుకు ‘బత్తా మసాజ్’ చేశారు.

రెండు చేతులతో రెండు బత్తాయిలను పట్టుకుని.. అర్చన వీపుపై మసాజ్ చేస్తుంటే… హాయిగా ఉందంటూ అర్చన తెగ ఎంజాయ్ చేసింది. నువ్వు ఇలా బత్తాయి మాసాజ్ చేస్తుంటే.. కళ్లు అలా మూసుకుపోతున్నాయి అని శివబాలజీ తో తెలిపింది. ఇక చివరి వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన ‘అర్చన, దీక్ష, హరితేజ, ఆదర్శ్‌లలో ఎవరు ఎలిమినేషన్ అవుతారో చూద్దాం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -