ఆర్ఆర్ఆర్ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర, బాలీవుడ్‌లో వార్ 2 చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు లైన్‌లో ఉండగానే కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తో సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ ప్రారంభం కానుండగా ఇవాళ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఆగస్ట్ 2024 నుండి సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్‌ను ఫైనల్ చేస్తున్నారని వెల్లడించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందనుంది. దేవర, వార్ 2 ప్రాజెక్టులను పూర్తి అయిన తర్వాత నీల్ మూవీ షూటింగ్‌లో పాల్గొననున్నారు ఎన్టీఆర్.
