తెలుగు వెండితెర దైవంగా బావించే నందమూరి తారక రామారావు జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ మూవీలో రామారావుగా ఆయన తనయుడు హీరో బాలకృష్ణ నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజాగా ఆడియో ఈవెంట్‌ను ఘనంగా జరుపుకుంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఆడియో ఫంక్షన్‌కు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరైయ్యారు.
ఇక ఆడియో ఫంక్షన్‌లోనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఎన్టీఆర్ సీని ప్రవేశం దగ్గర నుంచి రాజకీయ ప్రవేశం వరకు అన్ని ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్‌లో దర్శకుడు క్రిష్ పడిన ప్రతి కష్టం కనిపిస్తుంది. అయితే ఎన్టీఆర్ రోల్‌లో బాలయ్య సరిపోయాడా అనే ప్రశ్నలు మొదలైయ్యాయి. చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్స్‌లో బాలయ్య అచ్చం ఎన్టీఆర్‌లాగే ఉండటంతో ఆశ్చర్యపోయారు.ఎన్టీఆర్ రోల్‌లో బాలయ్య మెప్పిస్తాడనే అందరు భావించారు. కాని ట్రైలర్ చూసిన తరువాత బాలయ్యలో ఎన్టీఆర్ ఎక్కడ కనిపించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌లో ఉండే గాంభీర్యం ఎక్కడ బాలయ్యలో కనిపించలేదు. ఈ విషయాన్ని బాలయ్య అభిమానులు సైతం అంగీకరిస్తున్నారు.
బాలయ్య గొంతులో ఉండే బేస్ కూడా ట్రైలర్‌లో ఎక్కడ కనిపించలేదు. ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అని అందరు సినిమావైపు అనుమానంగా చూస్తున్నారు. ప్రతిభవంతుడైన క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో సినిమాపై ఎక్కడ నమ్మాకాలు తగ్గడం లేదు. మరి ప్రేక్షకుల నమ్మాకాలను క్రిష్ ఏ విధాంగా నిలబెట్టుకుంటాడో చూడాలి.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!