Thursday, May 8, 2025
- Advertisement -

ఎన్టీఆర్‌పై గౌరవం, ప్రేమ…… తారక్‌, బాలయ్యల మధ్య తేడా చూశారా?

- Advertisement -

సందేహం అక్కర్లేదు. మొత్తం నందమూరి కుటుంబంలో నిజంగా స్వర్గీయ నందమూరి తారక రామారావుపై భక్తి ప్రపత్తులు చూపిస్తోంది తారక్ ఒక్కడే అని చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ కుటుంబంలో ఉన్న అందరికీ కూడా బ్రతుకు భిక్ష పెట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. కానీ నందమూరి వంశస్థులు మాత్రం మొదటి నుంచీ కూడా ఎన్టీఆర్‌ని వాడుకోవడంపైనే దృష్టి పెడుతూ ఉన్నారు. రాజకీయ స్వార్థం కోసం ఎన్టీఆర్‌ని చంద్రబాబు వాడుకోవడాన్నే ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక బాలయ్య అయితే బాబును మించి అనే స్థాయిలో ఎన్టీఆర్‌ని ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తూ ఎన్టీఆర్‌ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వెన్నుపోటు సమయంలో కూడా తండ్రిని వదిలేసి బాబుకు జై కొట్టిన ఈ రామారావు పుత్రుడు ఇప్పుడు కూడా 2019 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఇమేజ్ చంద్రబాబుకు ఉపయోగపడేలా చేయడం కోసం మరోసారి ఎన్టీఆర్‌కి అన్యాయం చేస్తున్నాడు.

బాలకృష్ణ ఎంత గొప్ప నటుడైనా కావొచ్చు కాక. కానీ ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడి పాత్రకు న్యాయం చేయగలరా? అసలు బాలకృస్ణ పర్సనాల్టీ, వ్యక్తిత్వం ఎన్టీఆర్ పాత్రకు సూట్ అవుతాయా? సినిమా ఓపెనింగ్ రోజు బాలకృష్ణ వేసిన పౌరాణిక గెటప్పే తీవ్రస్థాయిలో కామెడీ అయిపోయింది. నెటిజనులు అందరూ కూడా ఒరిజినల్ అంటూ ఎన్టీఆర్ పౌరాణిక గెటప్‌ని, డూప్లికేట్ అంటూ బాలయ్య గెటప్‌ని చూపిస్తూ సెటైర్స్ వేసుకున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఏ స్థాయిలో కామెడీ అవుతుందో చెప్పనవసరంలేదు. అలాగే ఎన్టీఆర్ జీవిత కథను ఆసక్తికరమైన సినిమాగా మలిచేంత రచనా సామర్థ్యం, తెరకెక్కించేంత ప్రతిభ బాలయ్యకు ఉన్నాయా? ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా యూనిట్‌లో ఉన్నవాళ్ళకు ఎవరికైనా ఉన్నాయా? లేవు అన్నదే సమాధానం. అయితేనేం 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ఉపయోగపడడం కోసం ఎన్టీఆర్ జీవితచిత్రాన్ని కూడా కామెడీ చేయడానికి వెనుకాడడం లేదు బాలయ్య.

అయితే జూనియర్ ఎన్టీఆర్ మత్రం బాలయ్యకంటే ఎక్కువ భక్తి ప్రపత్తులను, ప్రేమను, గౌరవాన్ని స్వర్గీయ ఎన్టీఆర్‌పై చూపించాడు. కొన్ని విషయాల్లో బాలయ్యకంటే కూడా గొప్ప నటుడైన ఎన్టీఆర్…….‘స్వర్గీయ ఎన్టీఆర్ పాత్రను పోషించేంత సామర్థ్యం నాకు లేదు’ అని నిజాయితీగా చెప్పుకున్నాడు. ఆయన పాత్రను పోషించే ధైర్యం ఈ జన్మకు చేయలేను అని స్వర్గీయ ఎన్టీఆర్‌పైన ఉన్న భక్తిని చాటుకున్నాడు. ఆ ఎన్టీఆర్ పోలికలతో ఉన్నప్పటికీ………యమదొంగ లాంటి సినిమాల్లో ఆ ఎన్టీఆర్‌ని గుర్తుకు తెచ్చేలా అద్భుతంగా నటించినప్పటికీ…..జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ మహానటుడు ఎన్టీఆర్ పాత్రలో నటించడానికి తన సామర్థ్యం సరిపోదన్నాడు. కానీ బాలయ్య మాత్రం ఇప్పటి వరకూ రాముడిగా, శ్రీకృష్ణుడిగా కనిపించిన ప్రతిసారీ ఎన్టీఆర్‌లా కనిపించాలన్న ప్రయత్నంలో ఎక్కువ సార్లు నవ్వుల పాలయ్యాడు. అలాంటి బాలయ్య కేవలం 2019 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఇమేజ్‌ని వాడుకోవాలన్న బాబు స్వార్థం కోసం మహా నటుడైన ఆ ఎన్టీఆర్ ఇమేజ్‌ని ఫణంగా పెడుతుండడం మాత్రం ఆ ఎన్టీఆర్ అభిమానులను క్షోభకు గురిచేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -