తెలుగు వెండితెర దైవంగా బావించే నందమూరి తారక రామారావు జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ మూవీలో రామారావుగా ఆయన తనయుడు హీరో బాలకృష్ణ నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజాగా ఆడియో ఈవెంట్‌ను ఘనంగా జరుపుకుంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఆడియో ఫంక్షన్‌కు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరైయ్యారు. ఇక ఆడియో ఫంక్షన్లోనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
ఎన్టీఆర్ సీని ప్రవేశం దగ్గర నుంచి రాజకీయ ప్రవేశం వరకు అన్ని ట్రైలర్లో చూపించారు. ట్రైలర్ చూసిన వారందరూ కూడా ప్రశంసిస్తూనే ఉన్నారు. అంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్ విడుదలైన కాసేపటికే మిలియన్ వ్యూస్ ని రాబట్టి సత్తా చాటింది. ఇప్పటివరకు 3 మిలియన్ వ్యూస్ దాటేసి యూట్యూబ్ లో రికార్డులు నెలకొల్పే దిశలో పరుగులు తీస్తోంది.జనవరి 9న ‘కథానాయకుడు’ సినిమా, ఫిబ్రవరి 7న ‘మహానాయకుడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Advertisement -
యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న ‘ఎన్టీఆర్’ ట్రైలర్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -