అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. మొదటి సినిమా పేరునే తన సినిమా పేరుగా పెట్టుకున్నా అఖిల్‌కు కాలం కలిసి రాలేదు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది. ఈ సినిమా చూసిన వారు అఖిల్ హీరోగా నిలబడగలడా అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో గ్యాప్ తీసుకుని మరి , తమ ఫ్యామిలీకి మనం సినిమాతో మరిచిపోలేని హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్‌తో హలో సినిమా చేశాడు అఖిల్. ఈ సినిమా కూడా సరైన విజయాన్ని నమోదు చేయడంలో ఫెయిల్ అయింది. ముచ్చటగా మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు అఖిల్. అఖిల్ తాజాగా నటించిన మిస్టర్ మజ్ను సినిమా విడుదలకు రెడీ అవుతోంది. తొలిప్రేమ సినిమాతో డిసెంట్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను సినిమాకు దర్శకత్వం వహించాడు. తమ ఫ్యామిలీకి అచ్చి వచ్చిన లవ్ స్టోరీ, రొమాన్స్ కాన్సెప్ట్‌ను ఈ సినిమాకు ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. గతంలో అఖిల్ మొదటి సినిమాకు టాలీవుడ్ ప్రిన్ప్ మహేశ్ బాబు ఆడియో ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లుకు అఖిల్ సినిమా కోసం మరో స్టార్ హీరో రాబోతున్నాడు. మహేశ్ హిట్ ఇవ్వలేనిది, ఎన్టీఆర్ అయిన ఇస్తాడేమో చూడాలి. ఈ సినిమా ప్రి-రిలీజ్ ఈవెంట్( శనివారం ) హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సినిమాలో అఖిల్‌కు జంటగా నిధి అగర్వాల్ నటిస్తోంది. సినిమాను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి మూడో సినిమాతో అయిన అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!